సోగ్గాడే చిన్నినాయనా- ఓంగాడి రివ్యూ ..

చిక్కుల్లో ఉన్న ఫ్యామిలీని చనిపోయిన ఓ వ్యక్తి ఎలా కాపాడుకోగలిగాడన్నది కథ. ఈ కథ తెలుగు ప్రేక్షకులకు గానీ, హాలీవుడ్ ప్రేక్షకులకు గానీ కొత్త కాదు. మనకు యముడికి మొగుడు, యమలీలలున్నాయి. హాలీవుడ్ లో ‘ఘోస్ట్’ పేరుతో ఒక బ్లాక్ బస్టర్ ఉంది. సోగ్గాడే చిన్నినాయనలో కాన్సెప్ట్ ‘ఘోస్ట్’ కు కొంచెం దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి బదులు అతని ఆత్మ మాత్రమే ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

సాధారణంగా ఇంత కథ నేను చెప్పను. ఈ సినిమా నచ్చడానికీ, నచ్చకపోవడానికీ కథ పెద్ద పాత్ర పోషించదు అని గట్టిగా నమ్మడం వల్ల ఇంత కథా చెప్పినా. కథ పూర్తిగా అర్థం కాకముందే ‘సినిమా బాగా తీసినాడు కదా’ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది.

సినిమా గురించి చెప్పాలంటే పాటల గురించే చెప్పాలి. తెలుగు సినిమాల్లో పాటలెందుకు అనే ప్రశ్నకి ఈ సినిమా ఒక సమాధానంగా నిలుస్తుంది. ప్రతీ పాటా సినిమాకు ప్లస్ అయ్యేదే. నాగార్జున పంచె కట్టి వేసిన స్టెప్పులు చూస్తే అసలు ‘పాటలెందుకు అనవసరంగా’ అని నాలాంటోళ్లు అనడానికి ఆస్కారమే కనిపించదు.

బంగార్రాజు క్యారెక్టర్ లో నాగార్జున సూపర్బ్. అసలు పంచె కట్టులో రాజకీయాల్లో వై.ఎస్ ఎలాగో సినిమాల్లో నాగార్జున అలా అనిపించేలా ఉన్నాడు. రెండో క్యారెక్టర్ కు వయసు రీత్యా నాగార్జున సరిపోడు అనే విషయం మనకు తెలిసినా కన్విన్స్ అయ్యేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయినాడు. ఇంక రమ్యకృష్ణ గురించీ, మిగతా వాళ్ల గురించీ చెప్పను. ఓవరాల్ గా సినిమా గొప్పగా ఉందనిపించకపోయినా అందంగా కనిపిస్తుంది. చూస్తున్నంత సేపూ ఆహ్లాదకరంగానే ఉంటుంది. పండక్కి జనాలు అంతకంటే ఎక్కువ కోరుకుంటారని నేననుకోను.

ఫైనల్ గా .. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో & amp; amp; nbsp; ‘ఫాలో ఫాలో’ పాటని కొంతమంది ఫెమినిస్టులు విమర్శించడం చూసినా. అలాగే ఈ సినిమాని కూడా ఫెమినిస్టులకు విమర్శించేందుకు ఎప్పుడూ అవకాశం ఉంటుంది. మగాళ్ల విచ్చలవిడి తనాన్ని ప్రోత్సహించేలా ఉందనో, ఇంకోటనో వాళ్లు అంటారు. కానీ జనాలు మాత్రం సింపుల్ గా ‘నాన్సెన్స్’ అని తమ పని తాము చేస్కొని పోతారు.

డింగ డింగ డింగ్ డింగ్ డింగ డింగ డింగ్ డింగ్ .. .. .. .. యేస్కో నాగార్జునకు ఇంకో హిట్టు


nitrat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *