తెలుగు సెలెబ్రిటీ కపుల్స్ అండ్ బ్రాండ్ వాల్యూ ..

ఇద్దరు స్టార్స్ పెళ్లి చేస్కుంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ అదే స్థాయిలో కొనసాగడమో లేదంటే ఇంకా పెరగడమో జరుగుతుందనే అభిప్రాయముండేది నాకు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్, అభిషేక్ లు పెళ్లి చేసుకోవడం .. సైఫ్, కరీనా లు పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకు మరిన్ని ఎండోర్స్ మెంట్స్ వచ్చినాయి అని నా ఫీలింగ్. ఐశ్వర్య అంతటి స్టార్ అయినప్పటికీ ఎవరో అనామకుడిని పెండ్లి చేసుకోవడం వల్ల మాధురీ దీక్షిత్ కు అదే స్థాయిలో బ్రాండ్ వాల్యూ లేదని అనుకుంటా.

కానీ ఇదే తెలుగు ఇండస్ట్రీకి వస్తే ఇద్దరు స్టార్స్ మ్యారేజ్ చేసుకోకపోవడమే బెటర్ అనిపిస్తోంది. పవన్-రేణు మ్యారేజ్ వల్ల రేణు కెరీర్ ఆగిపోయింది. ఒక & amp; amp; nbsp; వేళ అది తిరిగి పుంజుకుందంటే దానికి కారణం వాళ్ళిద్దరూ విడిపోవడం వల్లనేనేమో! అలాగే నమ్రత-మహేష్ బాబు పెండ్లి కూడా నమ్రత కెరీర్ కు బ్రేకులేసింది.

వ్యక్తిగత కెరీర్ పొతే పోయింది, కనీసం జంటగా అయినా ఏమన్నా చేయడానికి ఉందా అంటే .. మహేష్ బాబు ఏ యాడ్ లో కూడా జంటగా కనిపించలేదు. పవన్ కళ్యాణ్. యాడ్స్ చేయడమే మానేసినాడు. చేసిన యాడ్స్ లోను రేణు లేదు & amp; amp; nbsp. ఇంక పొలిటికల్ కెరీర్లోకి & amp; amp; nbsp; కూడా భార్యని తోడు తెచ్చుకోలేదు.

అంతో ఇంతో నాగార్జున బెటర్. పెళ్లయ్యాక అమలతో కలిసి యాడ్స్ చేసినాడు. ఆ తర్వాత అమల కూడా కొన్ని సొంతంగా సినిమాలు, యాడ్స్ చేసింది. కాకపొతే కెరీర్ జూమ్ అయితే అవ్వలేదు. ఒకరకంగా కెరీర్ పెళ్లయిన కొత్తలో ఆగిపోయి, లేటు వయసులో తిరిగి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు.

ఇంకా ముందుకు వెళితే కృష్ణ తో పెళ్లయ్యాక కూడా విజయనిర్మల సినిమాలు చేసింది. కానీ పెళ్లి అనేది ఆమె బ్రాండ్ ని ఈ మేరకు నిలబెట్టిందో నాకైతే తెలీదు. జనాలు ఆమెను ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టరు గా చూస్తున్నారా, ఒక మాజీ హీరోయిన్ గా చూస్తున్నారా, లేక కేవలం కృష్ణ భార్యగా చూస్తున్నారా అనేదాని మీద క్లారిటీ లేదు.

ఇంక మరీ కొత్త తరం తీసుకుంటే రామ్ చరణ్ భార్య ఒక మ్యాగజీన్ కు ఎడిటర్ గా పనిచేస్తోంది. అయినా రామ్ చరణ్ తో పెళ్లి అయిన తర్వాత ఆ మ్యాగజీన్ ను చదివే వాళ్ళు పెరిగినట్టు కనిపించడం లేదు. అంటే ఉపాసన పెళ్ళికి ముందు సెలెబ్రిటీ కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి.

ఓవరాల్ గా సెలెబ్రిటీ పెండ్లిళ్ళు ఆడోళ్ళకి కెరీర్ కి అడ్డంగా మారతనాయి అని చెప్పొచ్చు.

(ఇంక సుమంత్ తో పెండ్లి చేస్కొని విడిపోయిన కీర్తి రెడ్డి కెరీర్ అక్కడే ఆగిపోయింది. కృష్ణ వంశీ ని చేసుకునేతప్పటికే రమ్యకృష్ణ కెరీర్ దాదాపు ముగిసింది. ఆ పెళ్లి వల్ల ఆమె కెరీర్ నిలబడినట్టు, లేకపోతే ఆ కపుల్ బ్రాండ్ వాల్యూ పెరిగినట్టు కనిపించదు. అయినా రమ్యకృష్ణ సినిమాలు కొనసాగించింది అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. ఐటెం సాంగులు కుడా చేసిందని మరిచిపోకూడదు.

ఇంక రాజీవ్ కనకాలతో పెండ్లి సమయానికి సుమ గానీ రాజీవ్ కానీ సెలెబ్రిటీలు కాదు. ఇంక సింగర్ గీతామాధురి ఒక యంగ్ హీరోని పెండ్లి చేసుకోవడం వల్ల మరింత మందికి చేరువాయింది అని సెప్పాలి. ఆ కొన్నాళ్ళ పాటు ఏ చానెల్ చూసినా వాళ్ళే . గీతామాధురికి తప్ప మరే సెలెబ్రిటీ కెరీర్ కు మరో సెలెబ్రిటీతో పెళ్లి అంత కలిసివచ్చినట్టు లేదు).


Seharusnya TIDAK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *